సంకల్పం ఉంటే సరిపోదు, సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనుక ఫీల్డ్ అధ్యయనం ఉండాలి. ఒక సాధికారత ఉండాలి. ఆ పని ఎవరి కోసం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఉపయోగపడాలి. మన్యంలో రహదారులు లేని చోట ప్రజలకు వైద్యం అందించేందుకు బైక్ ఆంబులెన్స్‌లు తెస్తున్నామని ఇటీవల బైక్ ఫొటో ని రిలీజ్ చేసింది ఏపీ సర్కారు.వైద్యసదుపాయాలు లేని చోటు నుండి ఆదివాసీలను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లడం కోసం చేస్తున్న ఆలోచన మంచిదే.
రూ.4లక్షలు వ్యయం అయ్యే ఈ వాహనాన్ని ఏజెన్సీలో నడిపి చూశారో లేదో తెలీదు కానీ… డ్రైవింగ్ సీట్ వెనుక , పేషెంట్ కూర్చునేందుకు వీలుగా ఒక కుర్చీని అమర్చారు. ఎగుడు దిగుడు దారుల్లో కుదుపులు వస్తే పేషెంట్ పడిపోయే అవకాశం ఉంది. ప్రాణాలు కాపాడటం అటుంచి, ప్రమాదాలు పాలయ్యే ఈ డిజైన్ ని ఎలా ఆమోదించారో తెలీదు.దీనికంటే మెరుగైన సురక్షితమైన బైక్ అంబులెన్స్‌లు 2018లో ఏజెన్సీలో తిరగడం చూశాను. అప్పటి ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఆలోచన అది. రోగికి ఎండ తగలకుండా, వాన నుండి కాపాడడానికి పైన కప్పు ,వెనక్కి వాలి పడుకోవడానికి వీలుగా బైక్ పక్కనే ఏర్పాటు చేశారు. పైలట్ ప్రజెక్ట్‌గా 122 వాహనాలు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వాటి సంఖ్యను పెంచి, కొనసాగిస్తే సరిపోతుంది.
ఇపుడు కొత్తగా వచ్చేవాటికి ఈ సదుపాయాలు లేవు. దీని మీద ఎక్కడానికి రోగులకు ధైర్యం చాలదు. ప్రభుత్వం ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే ఆర్ధిక భారం తగ్గుతుంది. ‘‘ రాదారి లేని కొండ కోనల్లో ఆపద్బంధువు’’ BBC కి రాసిన స్టోరీ … https://www.bbc.com/telugu/india-44938032