ఏసీల తయారీ హబ్‌… ఏపీ

(Ramachandra Reddy Palavali)

శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీల  పరిశ్రమకు భూమి పూజ  రూ .540 కోట్ల పెట్టుబడి : 1500 మందికి పైగా ఉపాధి శ్రీసిటీ , సెప్టెంబర్ 29, 2921: శ్రీసిటీలో బ్లూస్టార్ ఏసీ మెషిన్స్, విడిభాగాల తయారీ నూతన పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమిపూజ జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) లో భాగంగా పరిశ్రమ ఏర్పాటుకు బ్లూస్టార్ ముందుకురాగా, ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ లాంఛనంగా భూమిపూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లూస్టార్ ప్రెసిడెంట్, సీఈఓ సి.పి.ముకుందన్ మీనన్, వైస్ ప్రెసిడెంట్ వి.కసబేకర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్  రవీంద్ర సన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  సమావేశాన్ని ఉద్దేశించి త్యాగరాజన్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ తయారీ కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి చేపట్టిన వ్యూహాత్మక చొరవలో భాగంగా అధునాతన వసతులతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రేరణతో PLI స్కీమ్‌ ప్రభావంతో నూతన ప్లాంట్ లో ముఖ్యంగా విడి భాగాలను తయారు చేపట్టనున్నామని తెలిపారు. 

………………………………………………………………………………………………………

దేశం లోనే తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ లో పదిలక్షల మంది బాలికలకు

ఉచితం గా సానిటరీ ప్యాడ్స్ https://youtu.be/u3TPwrM81TM

…………………………………………………………………………………………………………………..

ఆత్మనిర్భర్ భారత్‌పై దృఢమైన నమ్మకం ఉన్న తాము, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేటర్ పరిశ్రమలో అతిపెద్ద దేశీయ తయారీదారుగా ఎదగడానికి ఆచరణాత్మక పయనం  సాగిస్తున్నామన్నారు.  తన మొదటి శ్రీసిటీ సందర్శనను గుర్తుచేసుకున్న త్యాగరాజన్, ప్రపంచశ్రేణి మౌళిక సదుపాయాలకు ఏ మాత్రం తీసిపోని ఇక్కడ వాతావరణాన్ని చూసి, వెంటనే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు.  ఈ సందర్భంగా రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజిరేటర్ తయారీలో పేరుగాంచిన ప్రముఖ స్వదేశీ బ్లూస్టార్ సంస్థను శ్రీసిటీకి ఆహ్వానించడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. బ్లూస్టార్ కు సంబంధించి దేశంలో ఇది 6వ  ఉత్పాదక యూనిట్‌, మరియూ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిది. దీనితో కన్స్యూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమకు కూడా శ్రీసిటీ ఆకర్షణీయమైన ప్రదేశంగా గుర్తింపు దక్కించుకుందన్నారు.

 (Ramachandra Reddy Palavali , Former Bureau In charge, Deccan Chronicle  and currently working as General Manager, Sricity (P) Ltd, Tirupati. email- ramachandra.palavali @gmail.com)

………………………………………………………………………………………………..

 ప్రముఖ ఐటీ కంపెనీ సయంట్‌ వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి విజయవాడలో  వాణిజ్య ఉత్సవ్ 2021 కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యారంగంలో ఒక అరుదైన విప్లవం చూస్తున్నాను అన్నారు.. వినండి https://youtu.be/BPCfZIClPvk

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles