తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తన సర్వీస్‌కి రాజీనామా బయటకు రావడం ఒక అరుదైప చర్చకు దారి తీసింది.ఇటీవల ఆయన కొన్ని వేదికల మీద మాట్లాడుతున్న తీరు, మరో రాజకీయ పార్టీకి పునాది అవుతుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆయన స్సష్టంగా చెప్పక పోయినా బడుగు వర్గాలను ఏకం చేసే ప్రయత్నం మాత్రం కనిపిస్తుంది. ఆయన ఉపాన్యాసాల పట్ల తెలంగాణ యువతరం చాలా ఆసక్తిగా కనబరుస్తున్నారని రూరల్ మీడియా పరిశీలనలో తెలిసింది.
దాదాపు 17ఏళ్లపాటు వివిధ స్థాయిల్లో పోలీసుల శాఖలో పనిచేసిన ప్రవీణ్ కుమార్.. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో పరిపాలన శాస్త్రంలో పీజీ చదివి.. ఉన్నత చదువులకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించారు.
సర్కారీ కొలువుల్లో ఉన్నపుడు ఏ శాఖలో ఉన్న తన మార్కు స్పష్టంగా కనిపించేలా చేసే ఈ ఐపీఎస్ అధికారి..కొంతకాలం క్రితం ‘హైదరాబాద్ రన్నర్స్’ మారథాన్‌లో రికార్డు సృష్టించారు. 48ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీగా పరుగెత్తి 42 కిలోమీటర్లను కేవలం 3.30గంటల్లో అవలీలగా చేధించి ఔరా అనిపించారు.
మరి ఇపుడు పొలిటికల్ మారథాన్‌లో ఎలాంటి రికార్డ్ సృష్టిస్తారో.. చూడాలి.https://youtu.be/pfbKJQ35LeE