దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక పార్కు శ్రీసిటీ

కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) మంగళవారం విడుదల చేసిన ఇండస్ట్రీయల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (IPRS) లో దేశంలోని 41  అత్యుత్తమ పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా, 13 అత్యుత్తమ సెజ్ లలో ఒకటిగా శ్రీసిటీకి ర్యాంకు దక్కింది. దక్షిణ భారతదేశంలో ఈ ర్యాంకును పొందిన ఏకైక పారిశ్రామిక పార్కు శ్రీసిటీ కావడం గమనార్హం. ఇది కాకుండా, IPRS ప్రకారం, అత్యున్నత స్థాయి పనితీరు కనబరచిన దేశంలోని 14 అత్యుత్తమ పనితీరు కలిగిన ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులలో ఒకటిగా, 15 టాప్ రేటెడ్ సెక్టార్ స్పెసిఫిక్ పార్క్‌లలో శ్రీసిటీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) ఒకటిగా గుర్తింపు దక్కించుకుంది.
మంగళవారం(5.10.21) న్యూఢిల్లీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సోమ్ ప్రకాష్ గారు ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (IPRS) 2.0 అప్‌గ్రేడ్ వెర్షన్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులకు ర్యాంకులను ఇచ్చారు. DPIIT సెక్రటరీ అనురాగ్ జైన్, ఇన్వెస్ట్ ఇండియా ఎండీ మరియు సీఈఓ దీపక్ బాగ్లా, ఆసియా అభివృద్ధి బ్యాంకు డైరెక్టర్ జనరల్ (దక్షిణాసియా) కెనిచి యోకోయమా తదితరులు ఇందులో పాల్గొన్నారు.
IPRS రేటింగ్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజర్ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి,  ఈ గుర్తింపు లభించినందుకు తమకు చాలా గర్వంగా వుందన్నారు. ఈ గౌరవం శ్రీసిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు, పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణానికి, స్థిరమైన పర్యావరణ ఉత్తమ పద్ధతులకు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. 

IPRS 2.0 పోర్టల్ లో దేశంలోని 449 పారిశ్రామిక పార్కులు మరియు ప్రత్యేక ఆర్థిక మండళ్ళుకు సంబందించిన సంపూర్ణ సమాచారం ఉంటుంది. బాహ్య మౌలిక సదుపాయాలు, అంతర్గత మౌలిక సదుపాయాలు, వ్యాపార మద్దతు సేవలు, పర్యావరణం, భద్రత తదితర కీలక పారామితులు ఆధారంగా లీడర్లు, ఛాలెంజర్స్ మరియు యాస్పిరెంట్స్ అనే మూడు కేటగిరీలలో విభజిస్తారు. రేటింగ్‌ను నిర్ణయించడానికి, వివిధ అంశాలలో తాము అడిగిన ప్రశ్నలకు పారిశ్రామిక పార్కుల (క్లయింట్లు) వినియోగదారులు ఇచ్చే సమాదానాలు, అలాగే, డెవలపర్లు నుండి కూడా సంబంధిత పారిశ్రామిక పార్కుల్లో సదుపాయాల లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దేశంలోని పారిశ్రామిక పార్కులు మరియు జోన్ల పోటీతత్వాన్ని పెంచడానికి, బలోపేతం కోసం పారిశ్రామిక మౌలిక సదుపాయాలలో ఉత్తమ పద్ధతులు మరియు అంతరాలను గుర్తించడంలో IPRS సహాయపడుతుంది.
పారిశ్రామిక మౌలిక సదుపాయాల పోటీతత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో నవంబర్ 2018 లో ADB మద్దతుతో DPIIT ఒక పైలట్ ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (IPRS) ను రూపొందించింది. పారదర్శక సమాచారాన్ని అందించడం, రాష్ట్రాలు తమ బలాన్ని ప్రదర్శించడం, రాష్ట్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతరాలను గుర్తించడం వంటి సులభమైన వ్యాపార సంస్కరణ ఎజెండాకు మద్దతు ఇవ్వడం కూడా దీని లక్ష్యం.

…………………………………………………………………………………

దేశం లోనే తొలిసారిగా ఆంధ్ర ప్రదేశ్ లో పదిలక్షల మంది బాలికలకు ఉచితం గా సానిటరీ ప్యాడ్స్ https://youtu.be/u3TPwrM81TM

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles