పచ్చదనాన్ని పరుపులా చుట్టేస్తున్న రాజశేఖర్ ఆధునిక సాగులో కొత్త వెలుగు!
‘‘ మాకు ఏడెకరాలుందన్నా. వరి పండిరచే వాళ్లం. ఎంతకష్టపడినా పెట్టుబడి గిట్టుబాటయ్యేది కాదు. వరి కంటే ఎక్కువ ఆదాయం వచ్చేసాగు చేయాలనుకున్నా. నాన్నను ఒప్పించి రెండు ఎకరాలు మా వరకు ధాన్యం పండిస్తూ , మిగిలిన పొలమంతా, గడ్డిని పెంచుతున్నా…’’ అన్నాడు. గడ్డిలో ఆదాయం ఏముంటదని అనుకోకండి. చీడ,పీడల బాధ లేదు. ఏ సీజన్‌లోనైనా పండుతుంది . ఎకరానికి మూడు లక్షల వరకు లాభం వస్తోంది. అందరికంటే భిన్నంగా నడిస్తే అద్భుతాలు జరుగుతాయని ఈ యువరైతు నిరూపించాడు. మీకు సమయం ఉంటే వీడియో .https://youtu.be/SZxH1RpcaOc చూడండి. ఘట్‌కేసర్( Medak district,TS ) వెళ్తుంటే, కనిపించింది ఈ పచ్చ బంగారు సాగు.