ఎపుడూ మేం లక్ష్యం పెట్టుకొని పనిచేయలేదు. గమ్యం తెలుసుకొని ప్రయాణించ లేదు కానీ , శ్రీలంక లో తిండి బాధలు, పాక్‌లో గోదుమల కోసం కొట్లాటలు చూశాక భవిష్యత్ లో ఆహారం కోసం యుద్ధాలు తప్పవు అనిపిస్తుంది! వాతావరణ పరిస్ధితుల్లో మార్పుల వల్ల సాగుబడి వర్క్ అవుట్ అయ్యేలా లేదు .అదే జరిగితే దానిని ఎలా ఫేస్ చేయాలి? అని…ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక కరవు గ్రామాల్లో తిరిగినపుడు అక్కడి ప్రజలను అడిగాం. వాళ్లు చాలా కూల్‌గా ‘‘ ఈ భూమి మీద వ్యవసాయం మొత్తం ఆగిపోయినా, మనుషులను బతికించే ఆహారం ప్రకృతిలో ఉంది!’’ అని కొన్ని రకాల దుంపలు, ఆకుకూరలు మాకు చూపించారు.అన్నంలో కలుపుకోవడానికి ఎర్రచీమల కారపు పొడి, ఊసిళ్లు (రెక్కలపురుగులు) తో చేసిన వేపుడు, కలమంద గడ్డ పులుసు, చింతపూల చారు … ఇలా చాలా రుచులను మాకు పరిచయం చేశారు .అడవులను,నేలను కాపాడుకో పోతే ఇవి కూడా అంతరించి పోతాయి అని వార్నింగ్ ఇచ్చారు. వాటిని ఎలా గుర్తించాలి? పోషక విలువలు ఏంటి? ఎలా వండాలి? మొత్తం డాక్యు మెంట్ చేస్తున్నాం. మిగతా పనుల తో పాటు ఈ సంవత్సరం దీని మీదనే ఎక్కువ దృష్టి పెడతాం. !
లోకమంతా కరవు కాటేసినా అడివి చేరదీస్తుంది. తిండి పెట్టి ఆదుకుంటుంది. సాగుచేయకుండానే అనేక పంటలను ఇస్తుంది. అలాంటివే ఈ అడవి తేగ దుంపలు! తీగ రూపంలో భూమి లోపల పెరుగుతాయి. https://youtu.be/mTyESVzHan8 https://youtu.be/mTyESVzHan8