Love…లవ్వాల !

లవ్ లవ్వాల….. ములుగు జిల్లాలోని తాడ్వాయి ……

కీకారణ్యం మధ్యలో ఉన్న అత్యంత పురాతన చారిత్రక ప్రదేశం లవ్వాల. ఎన్కౌంటర్ లతో దేశం దృష్టిని ఆకర్షించిన ఈప్రాంతం ఇప్పటివరకు చరిత్ర పరిశోధకుల దృష్టికి రాలేదు. అనంతమైన చరిత్రను,పురాతన జీవన అవశేషాలను తనలో నిక్షిప్తం చేసుకొని మీ రాక కోసం ఎదురు చూస్తోంది. తాడ్వాయి అడవుల్లోని దామరవాయి, మంగపేట దగ్గరలోని మల్లూరు,కొత్తూరు దేవునిగుట్టను మించిన అద్భుతాలు లవ్వాల అడవుల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.వందలాది ఆదిమ మానవుల సమాధులు ఇక్కడి అడవుల్లో ఉన్నాయి.

ములుగు జిల్లా పస్రా నుంచి తాడ్వాయి వైపు మెయిన్ రోడ్డు మీద సరిగ్గా తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేసి కుడివైపు ఆటవీమార్గంలో ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తే లవ్వాల వస్తుంది.ఊరు,ఆ పక్కనే వాగు దాటి వెళ్తే అద్భుత ప్రపంచం సాక్షాత్కరిస్తుంది.అక్కడి గుట్టలో అనేక పురాతన చారిత్రక ఆనవాళ్లు కన్పిస్తాయి. అక్కడి నుంచి దట్టమైన అడవిలో 10 నుంచి 12 కిలోమీటర్లు నడిస్తే పరిశోధకులకు సవాలు విసిరే అద్భుతం ఉందని స్థానికులు చెప్పారు.పెద్ద బండరాయి,నిలువెత్తుగా నలు చదరంగా ఉండే ఆ రాయి మీద ఆనాటి జీవన శైలిని ప్రతిబింబించే చిత్రాలు,పలు జంతువుల చిత్రాలు ఉన్నాయి.అది మామూలు విషయమే.కానీ ఋతువులు మారినప్పుడు ఆ బొమ్మలు మరిపోతాయని,స్థానభ్రంశం చెందుతాయని స్థానికులు పలువురు చాలా గట్టిగా చెప్పారు.

Watch a Wonder , Floating rock in Hyderabad 

ఈసారి వెళ్ళినప్పుడు చూడాలి.మీరెప్పుడు వచ్చినా చూపిస్తామని చెప్పారు.కనీసం ఏడాది,రెండేళ్లు దశల వారీగా పరిశోధిస్తే తప్ప ఆ రహస్యం ఏమిటో అంతు చిక్కదు. అలాగే అడవిలో మరో దిక్కుగా మూడు కిలోమీటర్లు కొండల్లో ప్రయాణిస్తే దేవునిగుట్ట లాంటి ఆలయం ఉందని చెప్పారు. కొత్తూరు,మల్లూరు,దామరవాయి లో కామన్ గా కనిపించే ఇసుక,గులకరాళ్ల మిశ్రమంతో తయారు చేసిన పెద్ద పెద్ద పలకరాళ్లు ఇక్కడ కూడా కనిపించాయి.ఇక్కడి ప్రకృతి రమణీయత సూపర్.వాగులు,పచ్చిక మైదానాలు,దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి.కరోనా కాదు కదా దాని బాబు కూడా ఇక్కడికి రాలేదు.మాస్కులు,శానిటైజర్లు పక్కన పడేసి ఇక్కడికి వచ్చేయండి.అద్భుత ప్రపంచంలో విహరించండి.చరిత్రను తవ్వి తీద్దాం.ప్రకృతి రహస్యాలను శోధిద్దాం రండి.లవ్ లవ్వాల…

వెల్కమ్ టు లవ్వాల.

మీ తోపుడుబండి సాదిక్, 9346108090,7330033330

………………………………………………………………

 RURAL MEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Trends, Rural Skills and traditions and their products.Culture, Success Stories, which are deviant and out of the ordinary. RURAL MEDIA is your one stop destination to uncovering the answers to all. And anyone can contribute to RURAL MEDIA. Shoot for us, report for us – your material is welcome so long as it meets the standards of this Channel and falls within our mandate. The everyday lives of everyday people.

Subscribe to the New Emerging World Of Journalism today,

https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles