ఈ గడ్డిని సాగు చేస్తే లక్షల్లో ఆదాయం. మెట్ట రైతులకు ఇంతకు మించిన పంట లేదు

ఈ పంటకు కాపలా అక్కర లేదు, జంతువుల బెడద ఉండదు , ప్రత్యేకంగా ఎరువుల అవసరం లేదు. కీటకాలు ఈ పంటను ఆశించవు. పెద్దగా పెట్టుబడి ఉండదు , వర్షాలు పడకపోయినా ఇబ్బంది లేదు, సారం లేని భూములే ఈ సాగుకు అనుకూలం.ఇంటి పెరటి లో కూడా పెంచు కోవచ్చు. ఈ గడ్డి నుండి తీసిన తైలానికి ఎనలేని డిమాండ్. ఈ పంటను సాగు చేస్తే, వరి కంటే రెట్టింపు ఆదాయం వస్తుంది…

సారం లేని భూములే ఈ సాగుకు  అనుకూలం.  ఇన్ని విశిష్టతలున్న పంటను సాగు చేయాలనుకుంటున్నారా? అదెలా సాధ్యమో తెలుసుకోవాలంటే, శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం,పోలేరు గ్రామంలో  కడియం కేశవరావును పకలకరించాలి. 

ఒరిస్సా,ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో  సంప్రదాయ పంటలతో వరుస నష్టాలు చూసిన ఈ సిక్కోలు రైతు ఇపుడు  వినూత్న పంటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇతడు చేస్తున్న గడ్డిసాగు ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

‘‘ గడ్డే కదాని లైట్‌ తీసుకోకండీ, ఈ కరోనా కాలంలో ఓ రేంజ్‌లో డిమాండ్‌ ఉన్న నిమ్మగడ్డి ఇది. ’’ అంటాడు కేశవరావు.గతంలో వరి సాగు చేసిన ఈ  రైతుకు ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అప్పులు చేసి,  పెట్టుబడులు పెట్టి ఆరుగాలం కష్టపడినా పంట నిలవదని గుర్తించి,  ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టిపెట్టాడు  సామాజిక మాధ్యమాలలో అన్వేషించి, బీడు భూముల్లో  ఏ పంట వేస్తే లాభదాయకమో  తెలుసుకున్నాడు. అలా నిమ్మ గడ్డి సేద్యం వైపు అడుగులు వేశాడు. ఒరిస్సాలో ఈ పంటను విజయవంతంగా సాగు చేస్తున్న రైతులను కలిసి మార్కెట్‌ పై అవగాహన పెంచుకున్నాడు.

https://youtu.be/OkikwljWIjg వీడియో చూడండి .

https://youtu.be/OkikwljWIjg

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles